భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

1, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

రవిచంద్ర దాతృత్వంతో మినరల్ వాటర్ ప్లాంట్

చిన్నముప్పారానికి రవిచంద్ర దాతృత్వం.. మినరల్ వాటర్ ప్లాంట్ కు భూమి పూజ..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ లీడర్ వద్దిరాజు రవిచంద్రతో పాటు ఆయన సోదరుల దాతృత్వంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజీవ్ సెంటర్‌లో తాగునీటి శుద్ధీకరణ యంత్రం ఏర్పాటుకు గురువారం భూమి పూజ నిర్వహించారు.

స్థానిక సర్పంచ్ రాయిలి భవాని శేఖర్ పీఎస్సీఎస్ మాజీ చైర్మన్లు దీకొండ వెంకన్న గౌడ్, గుండా వెంకన్న తదితరులతో కలిసి శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు పూర్తయితే ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రానుంది.

వద్దిరాజు కుటుంబానికి కృతజ్ఞతలు

ఈ సందర్భంగా సర్పంచ్ రాయిలి భవాని శేఖర్ మాట్లాడుతూ.. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుతో గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగునీరు లభించనుందని తెలిపారు. గ్రామ ప్రజల అవసరాన్ని గుర్తించి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరిస్తున్న ఎంపీ రవిచంద్రతో పాటు ఆయన సోదరుడు కిషన్ బ్రదర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

వద్దిరాజు కుటుంబం గ్రామ అభివృద్ధికి ఎంతో సహకారం అందిస్తోందని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేపడుతున్న ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లం ఐలయ్య, దర్శనం బిక్షపతి, రాయిలి ఉప్పలయ్య, ఆది చందు, కారుపోతుల సుమన్, రాయిలి గంగాధర్, కాలేరు నేతాజీ, తాడబోయిన లింగయ్య, కట్ల అనిల్, పద్మ కనకయ్య, రాకేష్, పల్ల రాము, కాలేరు లక్ష్మినర్సు, వెంకటేశ్వర్లు, నందయ్య, కామినేని బాలరాజు, శ్రీహరి, సోమయ్య, వీరేష్, లింగయ్య, పుల్లయ్య, రాంబాబు, పెంటయ్య, వెంకట్రాం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.