భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

1, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

గ్రామీణ ఆరోగ్య సేవలకు సెల్యూట్

బిజెపి ఆధ్వర్యంలో అంగన్వాడి ఆశాలకు ఘన సన్మానం..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రధాని నరేంద్ర మోదీ పాలన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రధాని పుట్టినరోజు పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంకల్ప్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా మండలంలోని మునిగలవీడు గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలకు గురువారం ఘనంగా సన్మానం చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు చందు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గద్దల సరోజిని, పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గద్దల సరోజిని మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు అందిస్తున్న సేవలు ఎంతో కీలకమైనవని అన్నారు. గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలను చేరువ చేయడంలో వారు చేస్తున్న కృషిని అభినందించారు. వారి సేవలను గుర్తించి సన్మానించడం సంతోషంగా ఉందన్నారు.

ప్రధాని పుట్టినరోజు పురస్కరించుకుని బీజేపీ నిర్వహిస్తున్న సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలను నెల రోజులపాటు కొనసాగిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా వివిధ వర్గాల సేవలను గుర్తించి వారిని సన్మానిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నల్లాని పాపారావు, మహిళా మోర్చా నాయకులు పిట్టల భవ్యశ్రీ, తోట రేణుక, పార్టీ మండల జనరల్ సెక్రటరీ రాస యాకిరెడ్డి, బాదావత్ సురేష్ నాయక్, జిల్లా నాయకులు మహమ్మద్ ముస్తఫా, సుందర్, నాయకులు వంగాల రామచంద్రు, జవహర్, మండల యువమోర్చా అధ్యక్షుడు శివ సాయి గౌడ్, యాకాంబరం, దుస్స యాకయ్య, బొబ్బల కృష్ణ, శీను, సలుగు ప్రవీణ్, సుధాకర్, కొప్పు లక్ష్మణ్, తోట రమేష్, నరసయ్య, యాకిరెడ్డి, శ్రీకాంత్, శ్రీను, వెంకన్న, సురేష్, అశోక్‌తో పాటు ఆశా కార్యకర్తలు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.