భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రధాని నరేంద్ర మోదీ పాలన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రధాని పుట్టినరోజు పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంకల్ప్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా మండలంలోని మునిగలవీడు గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలకు గురువారం ఘనంగా సన్మానం చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు చందు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గద్దల సరోజిని, పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గద్దల సరోజిని మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు,…