భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

1, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

వల్లూరులో 334 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ వినోద్ కుమార్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నార్సింగి మండల పరిధిలోని వల్లూరు గ్రామంలో సర్పంచ్ పిప్పిరి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామానికి మొత్తం 334 స్మార్ట్ రేషన్ కార్డులను సరఫరా చేయగా, వాటిని అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

అర్హులైన కుటుంబాలకు ప్రయోజనం

ఈ సందర్భంగా సర్పంచ్ పిప్పిరి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులను పొందడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుందని తెలిపారు.

నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ వినోద్ కుమార్

పాత రేషన్ కార్డుల స్థానంలో ఆధునిక సాంకేతికతతో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల వివరాలు, లబ్ధిదారుల గుర్తింపు సమాచారాన్ని నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.

గ్రామానికి మంజూరైన 334 స్మార్ట్ రేషన్ కార్డులను అర్హులైన లబ్ధిదారులకు అందజేయడం సంతోషంగా ఉందని సర్పంచ్ వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మిర్దొడ్డి రేఖ, జీపీఓ నాగరాజు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ముత్యాలు, లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.