భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

1, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన డీసీసీ చైర్మన్ ఉమా మురళి నాయక్

షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన డీసీసీ చైర్మన్ ఉమా మురళి నాయక్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వ్యాపార రంగంలో 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న మాశెట్టి అంబరీష్, శైలజ దంపతులు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వారాహి సిల్క్స్ షాపింగ్ మాల్ను డీసీసీ చైర్మన్ ఉమా మురళి నాయక్ ఘనంగా ప్రారంభించారు. మహబూబాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీసీసీ చైర్మన్ ఉమా మురళి నాయక్ మాట్లాడుతూ.. హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల వస్త్రాలు, ఆభరణాలు అందుబాటులో ఉండేలా శ్రీ వారాహి సిల్క్స్ను మహబూబాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. స్థానిక ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని అభినందించారు. శ్రీ వారాహి సిల్క్స్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన డీసీసీ చైర్మన్ ఉమా మురళి నాయక్

అనంతరం షాపింగ్ మాల్ యాజమాన్యం మాశెట్టి అంబరీష్, శైలజ దంపతులు మాట్లాడుతూ.. తమ సొంత భవనంలో శ్రీ వారాహి సిల్క్స్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమకు ఉన్న 35 సంవత్సరాల వ్యాపార అనుభవంతో వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలు, ఆభరణాలు అందుబాటులో ఉంచేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ గూగులోతు జ్యోతి, కౌన్సిలర్ చిధిరాల అరుణ జ్ఞానేశ్వర్, ప్రముఖ రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.