భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్రంలో మరో సంవత్సరం నరలో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. ఇనుగుర్తి మండల కేంద్రంలో ఉమ్మడి ఇనుగుర్తి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం గురువారం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బేతమల్ల చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించారు.
సమావేశానికి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాజరై బీఆర్ఎస్‌లో చేరిన పలువురికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ రవిచంద్రతో కలిసి తాను ఇనుగుర్తి మండలాన్ని సాధించానని గుర్తు చేశారు. కాంగ్రెస్ నుంచి ఇటీవల బీఆర్ఎస్‌లో చేరిన ఉప సర్పంచ్ సత్తూరి యాదగిరిని అభినందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని శంకర్ నాయక్ విమర్శించారు. వ్యవసాయానికి సాగునీరు, విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను చూసి ప్రజలు ఓట్లు వేశారని, వచ్చే ఎన్నికల్లో ఇక కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎప్పుడు ఏ ఆపద, ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని శంకర్ నాయక్ తెలిపారు. అంతకుముందు పలువురు నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, బీఆర్ఎస్‌కు అనుకూలంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, మండల, గ్రామ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.