భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

గార్ల రాతి స్తంభం బజార్‌లో ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు

గార్ల రాతి స్తంభం బజార్‌లో ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గార్ల మండలంలోని స్థానిక రాతి స్తంభం బజార్‌లో విశ్వశాంతి స్కూల్ సమీపంలో బొడ్డెమ్మ వేడుకలు అక్టోబర్‌ 1న సాయంత్రం 6 గంటలకు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బొడ్డెమ్మ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆటపాటలతో సందడి చేస్తూ ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు.

పునరుద్ధరించిన పాత సంప్రదాయం

గత కొన్ని సంవత్సరాలుగా మరుగునపడిన బొడ్డెమ్మ వేడుకలను స్థానిక మహిళలు తిరిగి ప్రారంభించడం విశేషంగా నిలిచింది. బతుకమ్మ పండుగకు ముందు ప్రారంభమయ్యే బొడ్డెమ్మ వేడుకలు తెలంగాణ పల్లె సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని మహిళలు తెలిపారు. పాత సంప్రదాయాన్ని మళ్లీ కొనసాగించడం పట్ల స్థానిక మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.

బొడ్డెమ్మను రకరకాల పూలతో అందంగా అలంకరించి, మహిళలు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆటపాటలతో తెలంగాణ సంస్కృతి, ఆచారాలను గుర్తుచేసుకున్నారు. ఈ వేడుకలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్ తరాలకు మన పాత సంప్రదాయాలను పరిచయం చేసినట్లవుతుందని హరే కృష్ణ కమిటీ సభ్యులు అన్నారు.

ఈ కార్యక్రమంలో గార్ల మండలానికి చెందిన స్థానిక మహిళలు, రాతి స్తంభం బజార్ హరే కృష్ణ కమిటీ మహిళా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.