భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

పేదల సంక్షేమమే గాంధీజీకి నిజమైన నివాళి: ఆంజనేయులు గౌడ్

ఘనంగా మాత్మ గాంధీ జయంతి వేడుకలు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నర్సాపూర్ పట్టణంలో ఆయన విగ్రహానికి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెడ్డిపల్లి గ్రామంలో చెత్త బుట్టలను పంపిణీ చేసి, శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత

ఈ సందర్భంగా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. స్వచ్ఛతతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

ఘనంగా మాత్మ గాంధీ జయంతి వేడుకలు

గాంధీజీ ఆశయాలను కొనసాగించాలి

మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, మానవత్వం, సామాజిక న్యాయం వంటి మహోన్నత విలువలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. గాంధీజీ కలలు కన్న సమానత్వం, సామాజిక న్యాయం, శాంతి, సౌభ్రాతృత్వంతో కూడిన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పేదలు, బలహీనవర్గాలు, అణగారిన ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేయడమే మహాత్మా గాంధీకి మనం అందించే నిజమైన నివాళి అని ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మి రాజు యాదవ్, రెడ్డిపల్లి సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, ప్రధాన కార్యదర్శి మేఘమాల, శ్రవణ్ కుమార్, కార్యదర్శి స్వాతి, నాయకులు రాధాకృష్ణ, రషీద్, సుధీర్ కుమార్, ఆంజనేయులు, నరేష్, సందీప్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.