భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నర్సాపూర్ పట్టణంలో ఆయన విగ్రహానికి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెడ్డిపల్లి గ్రామంలో చెత్త బుట్టలను పంపిణీ చేసి, శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత
ఈ సందర్భంగా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. స్వచ్ఛతతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని…






