భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపల్ పట్టణంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. గురువారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ పోషించిన కీలక పాత్రను వక్తలు స్మరించుకున్నారు. సత్యం, అహింస, శాంతి మార్గాలను గాంధీజీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిపారని పేర్కొన్నారు.
గాంధీజీ ఆశయాలను ఆచరించాలి
గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, స్వచ్ఛతకు ప్రాధాన్యతనిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలందరూ ఐకమత్యంతో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గాజవాడ నాగరాజు, పుట్టి సందీప్, దేవుని రంజిత్, దేమే యాదగిరి, డాకి స్వామి, చింతల యాదగిరి, విప్లవ్ యనిశెట్టి, అశోక్, చింతల స్వామి, రవి, బైరంకుమార్, సుందర్ సింగ్, బీఆర్ఎస్ నాయకులు మద్దెల రమేష్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.