భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జాతిపిత మహాత్మా గాంధీ అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ అన్నారు.
గాంధీ జయంతిని పురస్కరించుకుని మండలంలోని చిన్ననాగారం యూపీఎస్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య తదితరులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ప్రజలకు కూడు, గూడు అందించేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పలు పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ముత్యాల సోమక్క, చెడుపాక అలివేలు వెంకన్న, నిడిగంటి చంద్రమౌళి, గుండాల మంగమ్మ ధర్మయ్య, నాయకులు నాయిని కొమరయ్య, దాసరి ప్రకాష్, కొయ్యడి యాకాంతం, బైరు శ్రీనివాస్, పోలోజు విశ్వచారి, బైరు వెంకన్న, బైరు శ్రీరాములు, బైరు వేణు, చెడుపాక శేఖర్ తదితరులు పాల్గొన్నారు.