భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జాతిపిత మహాత్మా గాంధీ అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ అన్నారు.
గాంధీ జయంతిని పురస్కరించుకుని మండలంలోని చిన్ననాగారం యూపీఎస్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య తదితరులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ గాంధీజీ…






