భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

శేరిపల్లిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి: సర్పంచ్ సంతోష గొండ స్వామి యాదవ్

భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ చిత్రపటానికి గ్రామ సర్పంచ్ సంతోష గొండ స్వామి యాదవ్, ఉప సర్పంచ్ విజయ్ కుమార్, వార్డు సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష గొండ స్వామి యాదవ్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆయుధాలుగా చేసుకుని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, ఐక్యత, గ్రామ స్వరాజ్యం వంటి ఆశయాలు నేటి సమాజానికి కూడా ఎంతో ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను తమ జీవితంలో ఆచరించడంతో పాటు గ్రామాల్లో పరిశుభ్రతను పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములై ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన, శాంతియుతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను స్మరించుకున్నారు.

నీటిని పొదుపుగా వినియోగించాలి

గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి: సర్పంచ్ సంతోష గొండ స్వామి యాదవ్

అనంతరం గ్రామ చావిడి వద్ద వీవీజీ రామ్‌జీ పైన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని, నీటి సంరక్షణ కోసం ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

రైల్వే ఉద్యోగం సాధించిన అరుణ్ కుమార్‌కు సన్మానం

అనంతరం ఇటీవల రైల్వే ఉద్యోగం సాధించిన వడ్ల అరుణ్ కుమార్‌ను గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వార్డు సభ్యులు అరుణ్ యాదవ్, నవీన్ కుమార్, జంగర్ల మురళి, మానస కుమార్, మానస నవీన్, నవనీత వెంకటేశం, లక్ష్మి, శ్రీనివాస్, మల్లేశం, గ్రామస్తులు మల్లేశం, చంద్రం గౌడ్, శ్రీరామ్ భరత్, భాను ప్రసాద్, ఫీల్డ్ అసిస్టెంట్ రవి తదితరులు పాల్గొని మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు.