భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ చిత్రపటానికి గ్రామ సర్పంచ్ సంతోష గొండ స్వామి యాదవ్, ఉప సర్పంచ్ విజయ్ కుమార్, వార్డు సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష గొండ స్వామి యాదవ్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆయుధాలుగా చేసుకుని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి…






