భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

పోలీసు కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి

పోలీసు కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

గాంధీ ఆశయాలు పోలీసులకు మార్గదర్శకం

ఈ సందర్భంగా ఎస్పీ డా. శబరీష్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ అందించిన సేవలను, ఆయన పాటించిన అహింస, సత్యం, శాంతి వంటి అమూల్యమైన సిద్ధాంతాలను స్మరించుకున్నారు. గాంధీజీ ఆశయాలు నేటి ఆధునిక పోలీసు వ్యవస్థకు ఎంతో మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ప్రతి పోలీసు సిబ్బంది గాంధీజీ జీవితం నుంచి స్ఫూర్తి పొంది ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధత, పారదర్శకతతో విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, మత సామరస్యం, ప్రజా రక్షణ కోసం పోలీసులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

ప్రతి పౌరుడి హక్కులను గౌరవిస్తూ, సామాజిక న్యాయం, సమానత్వం వంటి గాంధీయ సూత్రాలకు అనుగుణంగా ప్రజలతో మమేకమై విధులు నిర్వహించాలని ఎస్పీ కోరారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్ రఘపతి రెడ్డి, ఆర్‌ఐలు భాస్కర్, నాగేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.