భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
గాంధీ ఆశయాలు పోలీసులకు మార్గదర్శకం
ఈ సందర్భంగా ఎస్పీ డా. శబరీష్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ అందించిన సేవలను, ఆయన పాటించిన అహింస, సత్యం, శాంతి వంటి…






