భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

హనుమాన్ నగర్ తండాలో వీవీజీ రామ్‌జీ గ్రామసభ

హనుమాన్ నగర్ తండాలో వీవీజీ రామ్‌జీ గ్రామసభ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని హనుమాన్ నగర్ తండాలో గాంధీ జయంతిని పురస్కరించుకుని వీవీజీ రామ్‌జీపై స్థానిక సర్పంచ్ గుగులోతు అశోక్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ముందుగా సర్పంచ్‌తో పాటు పాలకమండలి సభ్యులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అవసరమైన పనులకు దరఖాస్తు చేసుకోవాలి

ఈ సందర్భంగా సర్పంచ్ గుగులోతు అశోక్ కుమార్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన జాతిపిత అని కొనియాడారు. గ్రామసభలో భాగంగా వీవీజీ రామ్‌జీ కార్యక్రమంలో ఉన్న 350కి పైగా పనుల్లో గ్రామంతో పాటు గ్రామ పరిధిలోని అన్ని తండాలకు చెందిన ప్రజలు, రైతులు తమకు అవసరమైన పనుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

హనుమాన్ నగర్ తండాలో వీవీజీ రామ్‌జీ గ్రామసభ

ఇక నుంచి కూలీలకు 125 రోజుల పని దినాలు కల్పించనున్నట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నీటి పొదుపుపై అవగాహన

స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మిషన్ భగీరథ కుళాయి నీటిని మహిళలకు అందిస్తూ నీటి వినియోగం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, ఉపసర్పంచ్ శ్రీలత యాకు, వార్డు సభ్యులు లక్పతి, ప్రభాకర్, రవి, సోమ్ల, రజిత, ఫీల్డ్ అసిస్టెంట్ రవి, తండావాసులు పాల్గొన్నారు.