భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని హనుమాన్ నగర్ తండాలో గాంధీ జయంతిని పురస్కరించుకుని వీవీజీ రామ్‌జీపై స్థానిక సర్పంచ్ గుగులోతు అశోక్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ముందుగా సర్పంచ్‌తో పాటు పాలకమండలి సభ్యులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అవసరమైన పనులకు దరఖాస్తు చేసుకోవాలి
ఈ సందర్భంగా సర్పంచ్ గుగులోతు అశోక్ కుమార్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన జాతిపిత అని కొనియాడారు. గ్రామసభలో భాగంగా…






