భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

ఇనుగుర్తి మండలంలో గ్రామసభలు

ఇనుగుర్తి మండలంలో గ్రామసభలు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని వీవీజీ రామ్‌జీపై గ్రామసభలు నిర్వహించారు. మండల కేంద్రం ఇనుగుర్తితో పాటు అన్ని గ్రామపంచాయతీలలో ఆయా సర్పంచుల ఆధ్వర్యంలో పాలకమండలి సభ్యులు బాపూజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య ఆశయాలను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పోషించిన పాత్రను స్మరించుకున్నారు.

ఇనుగుర్తిలో..

ఇనుగుర్తి గ్రామంలో స్థానిక సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ అధ్యక్షతన గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పోషించిన పాత్ర ఎప్పటికీ మరువలేనిదని సర్పంచ్ పేర్కొన్నారు.

అనంతరం వీవీజీ రామ్‌జీ పనులపై గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో చేపట్టాల్సిన పనులు, ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సత్తూరి యాదగిరి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

చిన్ననాగారంలో..

చిన్ననాగారం గ్రామంలో సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులు బాపూజీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఇనుగుర్తి మండలంలో గ్రామసభలు

అనంతరం సర్పంచ్ అధ్యక్షతన వీవీజీ రామ్‌జీ పనులపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ గుర్రం సత్యనారాయణ గౌడ్ గ్రామస్తులకు వీవీజీ రామ్‌జీ పథకంలో చేపట్టనున్న పనులపై వివరించారు. గ్రామంలో చేపట్టాల్సిన పనులను రైతులు, గ్రామస్తులు గుర్తించారు.

గ్రామసభలో ఇంకుడు గుంతలు, ఫామ్ ఫండ్స్, సాగు భూముల వద్దకు వెళ్లేందుకు రహదారుల అభివృద్ధి వంటి సమస్యలను గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తమకు అవసరమైన పనులను గుర్తించి గ్రామాభివృద్ధికి సహకరించాలని అధికారులు సూచించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పిట్టల శేఖర్, వార్డు సభ్యులు బైరు వినయ్ గౌడ్, నడిగంటి చంద్రమౌళి, చెడుపాక సురేష్, మునిగంటి సరిత రాజు, గుండాల మంగమ్మ ధర్మయ్య, చెడుపాక అలివేలు వెంకన్న, ముత్యాల సోమక్క, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

అన్ని గ్రామాల్లో పనుల గుర్తింపు

ఇనుగుర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో వీవీజీ రామ్‌జీ పథకంలో చేపట్టనున్న పనులపై ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రజలకు వివరించారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తమకు అవసరమైన పనులపై అవగాహన పొంది, అవసరమైన పనులను గ్రామసభల ద్వారా సిఫారసు చేశారు.

ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.