భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని వీవీజీ రామ్‌జీపై గ్రామసభలు నిర్వహించారు. మండల కేంద్రం ఇనుగుర్తితో పాటు అన్ని గ్రామపంచాయతీలలో ఆయా సర్పంచుల ఆధ్వర్యంలో పాలకమండలి సభ్యులు బాపూజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య ఆశయాలను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పోషించిన పాత్రను స్మరించుకున్నారు.

ఇనుగుర్తిలో..

ఇనుగుర్తి గ్రామంలో స్థానిక సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ అధ్యక్షతన గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా…