భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

3, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

విద్యుత్ కోతలకు కారణం అదే.. కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్

మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బిఆర్ఎస్ పార్టీల

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ సభకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నాయకులు ప్రజలకు వివరించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని హరీశ్‌రావు, సునీతా లక్ష్మారెడ్డి సూచించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

పలువురు బీఆర్‌ఎస్‌లో చేరిక

సభలో వివిధ గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.

మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బిఆర్ఎస్ పార్టీల

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు విమర్శలు

కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమైందని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

విద్యుత్‌ కోతలపై ఆరోపణలు

రాష్ట్రంలో విద్యుత్‌ కోతలకు ఇతర కారణాలు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని హరీశ్‌రావు విమర్శించారు. బొగ్గు నిల్వలు చేయకపోవడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణను సక్రమంగా చేపట్టలేదని ఆరోపించారు. ప్రజలు, రైతుల సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వం కమిషన్లపై శ్రద్ధ చూపుతోందని మండిపడ్డారు.

విద్యుత్‌ సమస్య తీవ్రత పెరిగిన తర్వాత ప్రభుత్వం హడావుడి చర్యలకు దిగుతోందని, ‘‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు’’ వ్యవహరిస్తోందని హరీశ్‌రావు విమర్శించారు.