భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ సభకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నాయకులు ప్రజలకు వివరించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని హరీశ్‌రావు, సునీతా లక్ష్మారెడ్డి సూచించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.






