భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఆడబిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రం నెల్లికుదురు రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
76 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళలకు జీరో వడ్డీ రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నెల్లికుదురు మండలంలోని అర్హులైన 76 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున మొత్తం రూ.76,08,816 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
54 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు
అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్స పొందిన 54 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.16,89,000 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే మురళి నాయక్ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పంపిణీ చేశారు.
కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్‌కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చందా నరేష్, ఎంపీడీవో సింగారపు కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల, జిల్లా, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.