భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఆడబిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రం నెల్లికుదురు రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
76 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళలకు జీరో వడ్డీ రుణాలు,…






