భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

3, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

బాలికల గురుకులాన్ని సందర్శించిన దిశ సభ్యుడు బాబురావు

బాలికల గురుకులాన్ని సందర్శించిన దిశ సభ్యుడు బాబురావు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలోకి పాము ప్రవేశించిందన్న సమాచారం నేపథ్యంలో దిశ కమిటీ సభ్యుడు గుజ్జునూరి బాబురావు శనివారం విద్యాలయాన్ని సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి విద్యార్థినుల భద్రతకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు.

విద్యార్థినికి ధైర్యం చెప్పిన బాబురావు

శుక్రవారం సాయంత్రం పాఠశాల ఆవరణలో పామును చూసి తీవ్ర భయాందోళనకు గురైన అక్షయ అనే విద్యార్థినిని బాబురావు పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం పాఠశాల ఆవరణలోని పరిసరాలను పరిశీలించారు.

బాలికల గురుకులాన్ని సందర్శించిన దిశ సభ్యుడు బాబురావు

ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న పాత బాత్రూమ్‌ల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన గుర్తించారు. వాటిని వెంటనే తొలగించాలని పాఠశాల భవన నిర్మాణ విభాగం ఇంజనీర్ అరుణ్ కుమార్‌తో చరవాణిలో మాట్లాడి సూచించారు. దీనిపై ఇంజనీర్ సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఆవరణలో సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలి

విద్యార్థినుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాల ఆవరణలో సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని బాబురావు సూచించారు. రాత్రి వేళల్లో ఆవరణలో తగినంత వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అనంతరం పాఠశాల భోజనశాలను సందర్శించిన ఆయన అక్కడ అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించారు.