భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలోకి పాము ప్రవేశించిందన్న సమాచారం నేపథ్యంలో దిశ కమిటీ సభ్యుడు గుజ్జునూరి బాబురావు శనివారం విద్యాలయాన్ని సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి విద్యార్థినుల భద్రతకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు.
విద్యార్థినికి ధైర్యం చెప్పిన బాబురావు
శుక్రవారం సాయంత్రం పాఠశాల ఆవరణలో పామును చూసి తీవ్ర భయాందోళనకు గురైన అక్షయ అనే విద్యార్థినిని బాబురావు పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం పాఠశాల ఆవరణలోని పరిసరాలను పరిశీలించారు.
ఏళ్ల…






