భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, అక్టోబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

ఇస్నాపూర్‌లో సినీ హీరోయిన్ అనసూయ సందడి

ఇస్నాపూర్ లో సినీనటి అనసూయ

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ కేంద్రంలో సినీ హీరోయిన్ అనసూయ సందడి చేశారు. పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇస్నాపూర్ లో సినీనటి అనసూయ

అనసూయ రాకతో షాపింగ్ మాల్ పరిసర ప్రాంతాలు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనసూయతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు.

అభిమానులకు అభివాదం చేస్తూ అనసూయ సందడి చేయడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా అనసూయను చూసేందుకు వచ్చిన అభిమానులతో పరిసర ప్రాంతాలు కళకళలాడాయి.