భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, అక్టోబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

ఖాజాపూర్‌కు వైకుంఠరథం అందజేసిన పడకంటి సంగమేశ్వర్

ఖాజాపూర్ గ్రామానికి వైకుంఠ రథం అందజేసిన పడకంటి సంగమేశ్వర్..

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిన్నశంకరంపేట మండల పరిధిలోని ఖాజాపూర్ గ్రామానికి ఆదివారం వైకుంఠ రథాన్ని అందజేశారు. గ్రామానికి చెందిన కీర్తిశేషులు పడకంటి లచ్చయ్య, లింగమ్మ దంపతుల రెండవ కుమారుడు పడకంటి సంగమేశ్వర్ ఆధ్వర్యంలో ఈ వైకుంఠ రథాన్ని గ్రామానికి అందించారు. గ్రామ సర్పంచ్ మన్నే బాలస్వామి కోరిక మేరకు సంగమేశ్వర్ ఈ సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చారు.

స్వగ్రామానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలనే తపనతో పడకంటి సంగమేశ్వర్ గతంలోనూ పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. రామాయంపేటలో సాందీపని వేద గురుకుల పాఠశాలను స్థాపించి విద్యార్థులకు వైదిక ధర్మంపై విద్యను అందిస్తున్నారు. అదేవిధంగా గోశాలను నిర్మించి గోవుల సంరక్షణకు కృషి చేస్తున్నారు.

ఖాజాపూర్ గ్రామానికి వైకుంఠ రథం అందజేసిన పడకంటి సంగమేశ్వర్..

తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఖాజాపూర్ గ్రామంలో వాటర్ ప్లాంట్‌ను నిర్మించి, శుద్ధి చేసిన స్వచ్ఛమైన తాగునీటిని గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. తాజాగా గ్రామ ప్రజల అవసరాన్ని గుర్తించి వైకుంఠ రథాన్ని అందజేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

గ్రామానికి వైకుంఠ రథాన్ని అందించిన పడకంటి సంగమేశ్వర్‌కు సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ స్వగ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న సంగమేశ్వర్ సేవలను పలువురు అభినందించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నే బాలస్వామి, పాలకవర్గ సభ్యులు కుంట నరేష్, దేవేందర్, తిగుళ్ల బాలయ్య, సబిత, రామకళ, షేక్ రెడ్డి, హేమలత, మంజులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.