భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిన్నశంకరంపేట మండల పరిధిలోని ఖాజాపూర్ గ్రామానికి ఆదివారం వైకుంఠ రథాన్ని అందజేశారు. గ్రామానికి చెందిన కీర్తిశేషులు పడకంటి లచ్చయ్య, లింగమ్మ దంపతుల రెండవ కుమారుడు పడకంటి సంగమేశ్వర్ ఆధ్వర్యంలో ఈ వైకుంఠ రథాన్ని గ్రామానికి అందించారు. గ్రామ సర్పంచ్ మన్నే బాలస్వామి కోరిక మేరకు సంగమేశ్వర్ ఈ సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చారు.

స్వగ్రామానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలనే తపనతో పడకంటి సంగమేశ్వర్ గతంలోనూ పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. రామాయంపేటలో సాందీపని వేద…