భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, అక్టోబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

బీఆర్ఎస్ లీడర్ మల్లేష్ గౌడ్‌కు పరామర్శ

బీఆర్ఎస్ లీడర్ మల్లేష్ గౌడ్‌కు పరామర్శ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు వీరగాని మల్లేష్ గౌడ్ కుమారుడు విద్యాసాగర్ అకాల మరణంతో బీఆర్ఎస్ నాయకులు ఆదివారం మల్లేష్ గౌడ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యాసాగర్ మృతికి సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా స్వర్గీయ విద్యాసాగర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. చిన్న వయసులోనే విద్యాసాగర్ మృతి చెందడం తీవ్రంగా బాధాకరమని పార్టీ నాయకులు, కార్యకర్తలు విచారం వ్యక్తం చేశారు. ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.

పార్టీ మండల అధ్యక్షుడు పరిపాటి వెంకటరెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు మల్లేష్ గౌడ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

పరామర్శించిన వారిలో పులి రామచంద్రుడు, బిక్కు నాయక్, విజయ్ ఆది రెడ్డి, భీముడు నాయక్, హెచ్చు అశ్విన్, సైదులు, సుదగాని ఉపేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.