భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు వీరగాని మల్లేష్ గౌడ్ కుమారుడు విద్యాసాగర్ అకాల మరణంతో బీఆర్ఎస్ నాయకులు ఆదివారం మల్లేష్ గౌడ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యాసాగర్ మృతికి సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా స్వర్గీయ విద్యాసాగర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. చిన్న వయసులోనే విద్యాసాగర్ మృతి చెందడం తీవ్రంగా బాధాకరమని పార్టీ నాయకులు, కార్యకర్తలు విచారం వ్యక్తం చేశారు. ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యాన్ని కోల్పోకుండా…