భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ స్వర్గీయ గంజి కళావతి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు హాజరై ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళావతి విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె సేవలను స్మరించుకున్నారు.
కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు స్వర్గీయ గంజి కళావతి ప్రజా జీవితంలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా స్వర్గీయ కళావతి కుమారుడు, ఇనుగుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంజి రాజేందర్ రెడ్డి కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
కళావతికి నివాళులర్పించిన వారిలో బీఆర్ఎస్ పార్లమెంటరీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, ఇనుగుర్తి సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, ఉపసర్పంచ్ యాదగిరి, గాయత్రి గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత వద్దిరాజు కిషన్, వివిధ పార్టీల నాయకులు బైరు అశోక్ గౌడ్, దీకొండ వెంకన్న గౌడ్, దార్ల రామ్మూర్తి, కూరెళ్లి సతీష్, ఆర్టీఏ మెంబర్ రావుల మురళి, కేసముద్రం అల్లం నాగేశ్వరరావు, మార్కెట్ డైరెక్టర్ కొట్టం రాము, వెంకన్న, నాగరాజు, మురళి, నారాయణ, కాలేరు శివాజీ, రావుల మల్లేశం, గంజి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.