భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, అక్టోబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

చిలిపిచెడ్ బ్లాక్‌లో BRC సమావేశం

చిల్ప్‌చెడ్ బ్లాక్‌లో BRC సమావేశం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిల్ప్‌చెడ్ బ్లాక్‌కు సంబంధించిన బీఆర్సీ సమావేశాన్ని మెదక్ జిల్లా నర్సాపూర్ మండల సమాఖ్య కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్‌వీఈపీ కార్యకలాపాల పురోగతి, గ్రామ స్థాయిలో ఎంటర్‌ప్రెన్యూర్ల అభివృద్ధి, ప్రభుత్వ రుణ పథకాలతో అనుసంధానం, తదుపరి కార్యాచరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఎస్‌వీఈపీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రభుత్వ రుణ పథకాలను అర్హులైన ఎంటర్‌ప్రెన్యూర్లకు అనుసంధానం చేసి, వారి వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసేలా సహకారం అందించాల్సిన అవసరాన్ని వివరించారు.

చిల్ప్‌చెడ్ బ్లాక్‌లో BRC సమావేశం

అలాగే ఎంఎస్‌ఎంఈ ప్రతినిధులు రాజేంద్ర ప్రసాద్, సత్యేంద్ర, కేవీఐసీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లలితా దేవి ఆధ్వర్యంలో సీఆర్‌పీలు, ఎంటర్‌ప్రెన్యూర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామోద్యోగ్ వికాస్ యోజన (జీవీవై), పీఎంఈజీపీ రుణ పథకాలు తదితర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. రుణ పథకాల ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అమర్ సింగ్, ఏపీఎం గౌరీ శంకర్, సంగమేశ్వర్, ఎస్‌వీఈపీ మెంటర్, బీఆర్సీ పాలక సభ్యులు, సీఆర్‌పీలు, గ్రామ స్థాయి ఎంటర్‌ప్రెన్యూర్లు పాల్గొన్నారు.