భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, అక్టోబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: గవర్నర్

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: గవర్నర్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మంగళవారం నిర్వహించిన సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామాయంపేట నుంచి సిద్దిపేట వరకు సుమారు 43 కిలోమీటర్ల మేర 765 జాతీయ రహదారికి ఇరువైపులా దాదాపు 32 వేల జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: గవర్నర్

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: గవర్నర్

అదేవిధంగా రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే జీడిమామిడి వంటి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఉపయోగపడే పంటల సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: గవర్నర్

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రకృతిని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని అన్నారు. ప్రకృతితోనే సమస్త మానవ జీవితం ఆధారపడి ఉందని, పర్యావరణాన్ని కాపాడుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్కా కొమురయ్యతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.