భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మంగళవారం నిర్వహించిన సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామాయంపేట నుంచి సిద్దిపేట వరకు సుమారు 43 కిలోమీటర్ల మేర 765 జాతీయ రహదారికి ఇరువైపులా దాదాపు 32 వేల జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత…






