భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రజక ఆత్మగౌరవ భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన మెదక్ నియోజకవర్గ ప్రజలకు, అన్ని మండలాల జిల్లా కమిటీ సభ్యులకు రజక సంఘం జిల్లా ముఖ్య సమన్వయకర్త మామిడి సిద్ధిరాములు కృతజ్ఞతలు తెలిపారు. సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేసిన రజక సోదరులు, సోదరీమణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సభలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు రజకుల సమస్యల పరిష్కారానికి పలు హామీలు ఇవ్వడం పట్ల సిద్ధిరాములు హర్షం వ్యక్తం చేశారు. రజకుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించడం అభినందనీయమన్నారు. అలాగే సభ విజయవంతానికి సహకరించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రజకులను ఏకం చేసి సభకు అధ్యక్షత వహించిన జిల్లా గౌరవ అధ్యక్షుడు పోతురాజు రమణకు సిద్ధిరాములు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్రామాల నుంచి సభకు తరలివచ్చిన ప్రతి అక్క, అమ్మ, అన్న, తమ్ముడికి పాదాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు.
రజకుల ఐక్యతను చాటుతూ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మరోసారి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా రజకుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.