భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, అక్టోబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

గ్రామీణ ఆరోగ్య సేవలకు సెల్యూట్

గ్రామీణ ఆరోగ్య సేవలకు సెల్యూట్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని, మోదీ పాలన 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న సంకల్ప్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా మండలంలోని మునిగలవీడు గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలను మంగళవారం ఘనంగా సన్మానించారు.

బీజేపీ మండల అధ్యక్షుడు దుంపల సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు సరోజిని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలను శాలువాలతో సన్మానించి వారి సేవలను అభినందించారు.

ఈ సందర్భంగా డాక్టర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ, ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఒద్దిరాజు రామచంద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్‌గౌడ్, మదన్‌లాల్, చిన్న తండా ఉపసర్పంచ్ కవిత, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు సపావత్ సురేష్, పోలెపల్లి వెంకటేశ్వర్లు, లావుడియా బాలునాయక్‌తో పాటు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.