భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని, మోదీ పాలన 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న సంకల్ప్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా మండలంలోని మునిగలవీడు గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలను మంగళవారం ఘనంగా సన్మానించారు.
బీజేపీ మండల అధ్యక్షుడు దుంపల సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు సరోజిని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా…






