భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మానుకోట ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఎదళ్ల యాదవ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లికుదురులోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ జన్మదిన కేక్‌ను యాదవ రెడ్డితో పాటు పార్టీ నాయకులు కట్ చేసి, ఒకరికొకరు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.
ఈ సందర్భంగా యాదవ రెడ్డి మాట్లాడుతూ ప్రజా నేతగా, మృదుస్వభావిగా పేరొందిన ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ మానుకోట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మురళి నాయక్ మరిన్ని గొప్ప పదవులు అధిరోహిస్తూ ప్రజాసేవలో కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.