భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, అక్టోబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

మేం ఎట్లా బతకాలి నాన్నా..?”.. ముగ్గురు కూతుళ్ల కన్నీటి గాథ

మేం ఎట్లా బతకాలి నాన్నా..?”.. ముగ్గురు కూతుళ్ల కన్నీటి గాథ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ మృతి ఆయన కుటుంబాన్ని దిక్కులేనిదిగా చేసింది. దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన జనార్ధన్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబాన్ని అష్టకష్టాలు పడి పోషించిన ఆయన ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక భార్య, తల్లి, ముగ్గురు కూతుళ్లు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

జనార్ధన్‌కు సొంత ఇల్లు లేకపోవడంతో ఆయన కుటుంబం ప్రస్తుతం టెంట్‌లోనే జీవనం సాగిస్తోంది. కుటుంబానికి అండగా నిలిచిన జనార్ధన్ మృతితో వారి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఉండేందుకు సొంత ఇల్లు లేక, కుటుంబాన్ని ఎలా నడిపించాలో తెలియని పరిస్థితిలో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

“మేం ఎట్లా బతకాలి నాన్నా..?” అంటూ ముగ్గురు కూతుళ్లు వ్యక్తం చేస్తున్న ఆవేదన గ్రామస్తులను కలచివేస్తోంది. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధతో పాటు భవిష్యత్‌పై భరోసా లేకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. భార్య, తల్లి, ముగ్గురు కూతుళ్ల బాధ వర్ణనాతీతంగా మారింది.

మేం ఎట్లా బతకాలి నాన్నా..?”.. ముగ్గురు కూతుళ్ల కన్నీటి గాథ

తెలంగాణ ఉద్యమంలో భాగంగా పోరాడిన జనార్ధన్ కుటుంబం ప్రస్తుతం ఇలాంటి దుస్థితిలో ఉండటం పట్ల గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాల దృష్టికి ఇలాంటి కుటుంబాల పరిస్థితి వెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

అష్టకష్టాలు పడి కుటుంబ బండిని నడిపిన జనార్ధన్ లేకపోవడంతో ప్రస్తుతం ఆ కుటుంబానికి బతుకుపై భరోసా లేకుండా పోయిందని గ్రామస్తులు అంటున్నారు. కనీసం ఉండేందుకు సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం స్పందించి జనార్ధన్ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు సొంత ఇల్లు కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. దాతలు కూడా ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాము ఎదుర్కొంటున్న పరిస్థితులు మరే ఉద్యమకారుడి కుటుంబానికి రాకూడదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.