భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ మృతి ఆయన కుటుంబాన్ని దిక్కులేనిదిగా చేసింది. దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన జనార్ధన్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబాన్ని అష్టకష్టాలు పడి పోషించిన ఆయన ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక భార్య, తల్లి, ముగ్గురు కూతుళ్లు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

జనార్ధన్‌కు సొంత ఇల్లు లేకపోవడంతో ఆయన కుటుంబం ప్రస్తుతం టెంట్‌లోనే జీవనం సాగిస్తోంది. కుటుంబానికి అండగా నిలిచిన జనార్ధన్ మృతితో వారి జీవితం ఒక్కసారిగా…