భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, అక్టోబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

గ్రామాల్లో చేయూత పెన్షన్ల వెరిఫికేషన్

గ్రామాల్లో చేయూత పెన్షన్ల వెరిఫికేషన్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో డీఆర్డీఏ జిల్లా అధికారి మల్లీశ్వరి చేయూత పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేశారు. ఎంపీడీవో బండారు పార్థసారథితో కలిసి మంగళవారం మండలంలోని చిన్ననాగారం, అయ్యగారిపల్లి, కోమటిపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అభ్యర్థుల వివరాలను సేకరించి, పెన్షన్‌కు సంబంధించిన అంశాలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుల పరిస్థితులను పరిశీలించి అర్హతకు సంబంధించిన వివరాలను అధికారులు నమోదు చేశారు.

పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్ఏలతో రివ్యూ

గ్రామాల్లో చేయూత పెన్షన్ల వెరిఫికేషన్

అనంతరం ఇనుగుర్తి ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వీబీజీ రాంజీ ఫీల్డ్ అసిస్టెంట్లతో డీఆర్డీఏ జిల్లా అధికారి మల్లీశ్వరి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చేయూత పెన్షన్లు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులు, వీబీజీ రాంజీ పథకంలో చేపట్టిన పనులు, జాబ్ కార్డుల కేటాయింపు తదితర అంశాలపై పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పార్థసారథి, ఏపీవో దీప్లా, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.