భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, అక్టోబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

లక్ష్మీపురంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ జన్మదిన వేడుకలు

లక్ష్మీపురంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ జన్మదిన వేడుకలు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం గ్రామంలో మానుకోట ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ జన్మదిన వేడుకలను గ్రామ సర్పంచ్ ముదిరెడ్డి కళావతి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ జన్మదిన కేక్‌ను కళావతి, శ్రీనివాస్ రెడ్డితో పాటు నాయకులు కట్ చేసి, ఒకరికొకరు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.

ఈ సందర్భంగా కళావతి, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా నేతగా, మృదుస్వభావిగా పేరొందిన ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ మానుకోట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న ఎమ్మెల్యే మరిన్ని గొప్ప పదవులు అధిరోహిస్తూ ప్రజాసేవలో కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మురళీ నాయక్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ బద్రు, వార్డు సభ్యులు అశోక్, సావిత్ర, వీరన్న, పరమేష్, నాయకులు బాణాల వెంకన్న, ఎల్. వెంకన్న, భూక్య లాలు, ముత్యాల వెంకన్న, లచ్చయ్య, గాడిపెల్లి వెంకన్న, బాణాల భిక్షం, చిన్న భిక్షం, చిన్న వెంకన్న, శ్రీను, కర్ణకంటి సంజీవరెడ్డి, యాకుబ్ రెడ్డి, మహిళా నాయకులు కర్ణగంటి లక్ష్మి, శేషమ్మ, సముద్రమ్మ, సరస్వతి, ధనమ్మ, రమ, జమున, భారతమ్మ, లక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు.