భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

UTF మండల అధ్యక్ష కార్యదర్శులుగా సూర్యప్రకాష్, ప్రేమయ్య

యుటిఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులుగా సూర్యప్రకాష్,ప్రేమయ్య

భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల నూతన అధ్యక్ష కార్యదర్శులుగా మందడి సూర్యప్రకాష్, పాలవెల్లి ప్రేమయ్యలు ఎన్నికయ్యారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మల్లెపాక రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన UTF మండల మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

ఎన్నికల నిర్వాహకులుగా జిల్లా అధ్యక్షులు సోంబాబు, జిల్లా కన్వీనర్ వెలుగు రమేష్ వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న అగ్రగామి సంఘం UTF అని చెప్పారు.

కేవలం ఉపాధ్యాయుల సంక్షేమం కోసమే కాకుండా.. విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందేలా, ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకునేలా UTF నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రయోజనాల కోసం సంఘం మరింత బలోపేతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో UTF నాయకులు మిట్టగడుపుల రమేష్, భీవనపల్లి శ్రీనివాస్, పాలకుర్తి ఎల్లయ్య, గణేష్‌తో పాటు పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.