భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల నూతన అధ్యక్ష కార్యదర్శులుగా మందడి సూర్యప్రకాష్, పాలవెల్లి ప్రేమయ్యలు ఎన్నికయ్యారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మల్లెపాక రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన UTF మండల మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఎన్నికల నిర్వాహకులుగా జిల్లా అధ్యక్షులు సోంబాబు, జిల్లా కన్వీనర్ వెలుగు రమేష్ వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న…






