భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

వీబీజీ రాంజీ పథకం పనులను పరిశీలించిన MPDO

వీబీజీ రాంజీ పథకం పనులను పరిశీలించిన MPDO

భారత్ సమాచార్, నల్లగొండ జిల్లా: దామరచర్ల మండలం బాలాజీనగర్ తండా గ్రామపంచాయతీలో వీబీజీ రాంజీ పథకం కింద కొనసాగుతున్న పనులను MPDO వెంకటయ్య పరిశీలించారు. గ్రామ సర్పంచ్ రాధారమణ వాంకుడోత్‌తో కలిసి పథకం ద్వారా చేపడుతున్న ఫామ్ పాండ్ పనులను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో APO నాగేశ్వరరావు, టెక్నికల్ అసిస్టెంట్ శంకర్, ఫీల్డ్ అసిస్టెంట్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం వాంకుడోత్ తండా అంగన్‌వాడీ కేంద్రాన్ని MPDO వెంకటయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలోని రికార్డులు, అందుబాటులో ఉన్న సరుకులను పరిశీలించి, కేంద్రం నిర్వహణపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్య, అభివృద్ధి పనులను సమీక్షించారు.

వీబీజీ రాంజీ పథకం పనులను పరిశీలించిన MPDO

ఈ సందర్భంగా MPDO వెంకటయ్య మాట్లాడుతూ.. వీబీజీ రాంజీ పథకాన్ని ఉపాధి హామీ కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు, వర్షపు నీటిని నిల్వ చేసే గుంతలు, కమ్యూనిటీ సోక్‌పిట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపడటంతో పాటు భూగర్భ జలాల సంరక్షణకు దోహదపడుతుందని తెలిపారు.

గ్రామాభివృద్ధి కోసం చేపడుతున్న పనులను నాణ్యతతో, నిర్ణీత ప్రమాణాల మేరకు పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సోమేష్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు, ఉపసర్పంచ్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.