భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

చిన్నముప్పారంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్

ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో రైతుల హర్షం.. ఎంపీ రవిచంద్ర కు రుణపడి ఉంటాం..                        సర్పం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామ రైతుల అభ్యర్థన మేరకు BRS పార్లమెంటరీ నాయకుడు, MP రవిచంద్ర నూతన ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయించారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కావడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాయలి భవానీ శేఖర్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌ఫార్మర్ లేక రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిన సమయంలో రైతుల కష్టాలు, ఇబ్బందులను గుర్తించిన MP రవిచంద్ర వెంటనే స్పందించి నూతన ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయించారని తెలిపారు. ఇందుకు MP రవిచంద్రకు తాము, రైతులంతా రుణపడి ఉంటామని చెప్పారు.

కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా వ్యవసాయ మోటార్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందడంతో రైతుల పంటలకు అవసరమైన నీరు అందే అవకాశం ఏర్పడిందని సర్పంచ్ భవానీ శేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ PACS చైర్మన్ గుండా వెంకన్న, కొత్తపెల్లి రమేష్, కాలేరు చంద్రశేఖర్, అలువాల మల్లయ్య, నేరెళ్ల కృష్ణ, గుండ్ల యాకన్న, మల్లం మురళి, గుండా దేవేందర్, కొత్తపల్లి నరేష్, రడం ముత్తయ్య, కొండ ముత్తయ్య తదితర రైతులు పాల్గొన్నారు.