భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామ రైతుల అభ్యర్థన మేరకు BRS పార్లమెంటరీ నాయకుడు, MP రవిచంద్ర నూతన ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయించారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కావడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాయలి భవానీ శేఖర్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌ఫార్మర్ లేక రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిన సమయంలో రైతుల కష్టాలు, ఇబ్బందులను గుర్తించిన MP రవిచంద్ర వెంటనే స్పందించి నూతన ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయించారని తెలిపారు. ఇందుకు MP…






