భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

రామాయంపేటలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

రామాయంపేటలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరచడంతో పాటు భవిష్యత్ విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా సామర్థ్యాన్ని పెంచేందుకు విద్యుత్ శాఖ అధికారులు కీలక పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న 8 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్ (PTR) సామర్థ్యాన్ని 12.5 MVA PTRగా పెంచే పనులు నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ AE తిరుపతిరెడ్డి తెలిపారు.

ఈ పనుల నిర్వహణలో భాగంగా ఈ నెల 8న ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు సంబంధిత ఫీడర్లలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం

రామాయంపేటలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

విద్యుత్ సరఫరా నిలిపివేత కారణంగా రామాయంపేట పట్టణంలోని మొత్తం ప్రాంతంతో పాటు దామరచెరువు AGL ప్రాంతం మొత్తం, రామాయంపేట AGL ప్రాంతం మొత్తం, ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర విద్యుత్ వినియోగదారులు విషయాన్ని గమనించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సరఫరా నిలిచే సమయానికి అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

పవర్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్య పెంపు పనులు పూర్తయిన అనంతరం విద్యుత్ సరఫరాను యథావిధిగా పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.