భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

ఈటల రాజేందర్‌ను కలిసిన మండల BJP నేత తోట రమేష్

ఈటలను కలిసిన మండల బిజెపి నేత తోట భారత్ సమాచార్ మహబూబాబాద్ జిల్లా: భారతీయ జనతా పార్టీ మల్కాజ్‌గిరి ఎం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భారతీయ జనతా పార్టీ (BJP) మల్కాజ్‌గిరి MP ఈటల రాజేందర్‌ను BJP నెల్లికుదురు మండల నాయకుడు తోట రమేష్ ఆధ్వర్యంలో మండలంలోని నైనాల గ్రామానికి చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు అంశాలు, స్థానిక సమస్యలపై ఈటల రాజేందర్‌తో నాయకులు చర్చించారు.

పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలు తదితర అంశాలపై ఈటల రాజేందర్‌తో నాయకులు మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తోట రమేష్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో BJP గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆకుల లింగయ్య, బూత్ అధ్యక్షుడు తోట సురేష్, దాసరి శేఖర్, ఏర్పుల మధు పాల్గొన్నారు.